సెమీఫైనల్లోకి ఇండియా
posted on Mar 19, 2015 4:50PM

ప్రపంచ కప్ క్రికెట్ 2015లో భారత జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్‌లో రోహిత్ శర్మ 137 పరుగులు చేసి ఇండియా గౌరవప్రదమైన స్కోరు చేయడానికి సహకరించాడు. ఇంకా శిఖర్ ధావన్ 30 పరుగులు, విరాట్ కోహ్లీ 3, రహానే 19, రైనా 65, ధోనీ 6, జడేజా 23, అశ్విన్ 3 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ 3 వికెట్లు, మొర్తాజా, రుబెల్, షకీబ్ తలా ఒక వికెట్ తీశారు. 303 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన బంగ్లాదేశ్ జట్టు 33 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పుంజుకున్నప్పటికీ అనిపించినప్పటికీ వరుసగా వికెట్లు కోల్పోతూ వుండటంతో విజయానికి దూరమవుతూ వచ్చింది. చివరికి 45 ఓవర్లకు 193 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దాంతో భారత జట్టు విజయవంతంగా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది.