మోడీకి వాజ్‌పేయి ఆశీస్సులు
posted on May 26, 2014 2:23PM

ఈరోజు సాయంత్రం భారతదేశ 15వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోడీ బీజేపీ మాజీ ప్రధాని వాజ్‌పేయిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. దేశంలోనే ఉన్నతమైన భాధ్యతను చేపట్టబోతున్న మోదీ భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా తగిన సూచనలు, సలహాలను వాజ్‌పేయి దగ్గర తీసుకున్నారు. ఆ తరువాత రాజ్ ఘాట్ సందర్శించి పూజ్య బాపూజీకి నివాళులు అర్పించారు. ఆయన చిన్న మంత్రి వర్గంతోనే సుపరిపాలన అందించాలని భావిస్తున్నందున, కొన్ని మంత్రిత్వ శాఖలను ఒకే గొడుగు క్రిందకు తీసుకువచ్చి వాటిన్నిటి బాధ్యత ఒకే మంత్రికి అప్పగించబోతున్నారు. ఇప్పటికే వారి పేర్లతో కూడిన జాబితా రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం జరిగింది. వారందరినీ రాష్ట్రపతి కార్యాలయం నుండి ప్రమాణస్వీకారానికి సిద్దంగా ఉండమని కోరుతూ ఆహ్వానాలు పంపడం జరిగింది.