మోడీ ప్రమాణం: ఢిల్లీకి చేరుకున్న నవాజ్, రాజపక్సే
posted on May 26, 2014 11:39AM

నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సార్క్ దేశాధినేతలు ఒక్కక్కరు భారత్‌కు చేరుకుంటున్నారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొద్ది సేపటి క్రితం న్యూఢిల్లీ విమానాశ్రయంకు చేరుకున్నారు. ఆయనకు భారత దౌత్యాధికారులు ఘన స్వాగతం పలికారు. తాను శాంతి సందేశం ఇచ్చేందుకే భారత్‌కు వచ్చానని షరీఫ్ తెలిపారు. నవాజ్ షరీఫ్ రేపు భారత కొత్త ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది.
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఢిల్లీకి చేరుకున్నారు. కొద్ది సేపటికి క్రితం రాజపక్సే ఇక్కడి విమానాశ్రయంకు చేరుకుని అక్కడ నుంచి ఆయన తనకు ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి హాజరుకావడానికి ఆయన ఇక్కడకు వచ్చారు. కాగా, రాజపక్సే రాకను తమిళ పార్టీలు నిరసిస్తున్న కారణంగా రాజపక్సేకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.