రవిశంకర్, జవదేకర్, హర్షవర్ధన్ పై వేటు.. మోడీ యాక్షన్ ప్లాన్ ఏంటో ? 

వచ్చే సంవత్సరం ఆరంభంలో జరిగే ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రధాని మోడీ తలపెట్టిన మంత్రివర్గ విస్తరణ కసరత్తు, అనూహ్యంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో కొద్దిపాటి మార్పులు, కొత్త వారికి మరిన్ని అవకశాలుగా ఉంటుందనుకున్న మంత్రివర్గ విస్తరణకు ముందుగా ప్రదాని ఇంచు మించుగా డజను మందికి ఉద్వాసన పలికారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ సహా  మొత్తం 12 మంత్రి మంత్రులు ప్రధాని అదేసం మేరకు తమ పదవులకు రాజీనామా చేశారు. కొత్త మంత్రుల ప్రమాణానికి కొన్ని నిమిషాల ముందు సీనియర్ మంత్రులు రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ కూడా రాజీనామా చేశారు, నిజంగా ఇది ఎవరు ఉహించని అనూహ్య పరిణామంగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముందే పదవులకు రాజీనామా చేసిన వారిలో హర్షవర్ధన్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్,  రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్,  బబుల్ సుప్రియో, ప్రతాప్ సారంగి రాజీనామా ఉన్నారు. అయితే, ఇంతమందిని మంత్రి వర్గం నుంచి తొలిగించడానికి కారణం ఏమిటనే విషయంలో ఎవరి అభిప్రాయం వారు వ్యక్త పరుస్తున్నారు. అయితే, ప్రధాన కారణం మాత్రం, వైఫల్యం. ముఖ్యంగా కొవిడ్ సంక్షోభ సమయంలో మంత్రుల పనితీరు ఆధారంగా ప్రధాని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇంచుమించుగా గత నెలరోజులకు పైగా ప్రధాని వివిద శాఖల మంత్రులు, అధికారాలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రుల్ పనితీరును తెలుసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని అంతర్గత వర్గాల సమాచారం. 

అయితే,ప్రధాని నిర్ణయం ఆడ లేక మద్దెల ఓడు అన్నట్లు ఉందని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. అయితే, అన్ని వర్గాలకు సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.సెకండ్ వేవ్’ ఆర్థిక రంగం మొదలు రాజకీయ రంగం వరకు అన్ని రంగాలలో  సృష్టించిన సంక్షోభం నుంచి బయటపడేందుకు అవసరమైన శక్తిని కూడగట్టుకునేందుకు, దిద్దుబాటు చర్యల్లు తీసుకునేందుకు వీలుగా మంత్రి వర్గంలో ప్రధాని భారీ మార్పులు తీసుకున్నారని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న గట్టి సంకేతాలు ఇచ్చేందుకే ఇంత భారీ కసరత్తు చేపట్టారని అంటున్నారు. ఒక విధంగా మధ్యంతర దిద్దుబాటు చర్యగానూ భావిస్తున్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారిగా 14 మంది కేంద్ర మంత్రులకు ఉద్వాసన పలకడం పట్ల కాంగ్రెస్ పార్టీ  ఘాటుగా స్పందించింది. మంత్రుల  పనితీరును పరిగణనలోకి తీసుకొని గనక తప్పిస్తే, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, పెట్రోలియం మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఎదో అనుకుంటే ఎదో జరుగుతోంది అనేది మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu