ప్రియుడి ప్లాన్.. ప్రియురాలు ప్లాప్.. 

ప్రేమ గుడ్డిది.. ప్రేమకు వయసుతో పనిలేదు..మనసు మాత్రమే ఉంటుంది... ప్రేమ స్వచ్ఛమైనది.. ప్రేమ ఎల్లలు లేనిది.. ప్రేమ కులం మతం లేనిది. ప్రేమ ఒక ప్రపంచం.. ప్రేమ ఒక వ్యసనం.. ఇవన్నీ నిజాలే ఎందుకంటే ప్రేమలో ఉన్నవాళ్ళకి ప్రేమించడమే తెలుసు.. అంతేగాని అది ఇది అని ఎంచి చూడదు. ప్రేమ చాలాగొప్పదే కానీ అదే ప్రేమతో చాలా మోసాలు జరుగుతున్నాయి నేటి సమాజంలో.. తాజాగా ఒక అబ్బాయిని నమ్మిన అమ్మాయికి మోసం జరిగింది.. అదేంటో మీరే తెలుసుకోండి..

ఒక యువతీ తను  ప్రేమించిన వ్యక్తి కోసం రాష్ట్రాలు దాటి వెళ్ళింది.. యువతికి ప్రేమ దక్కలేదు.. ప్రియుడు తక్కలేదు.. అంతే కాదు అందమైన  చేదు అనుభవం ఎదురైంది. ప్రియుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు తనను నిర్బంధించి బెదిరింపులకు గురిచేస్తారని ఊహించని ఆ యువతి రెండు రోజుల పాటు తీవ్ర మనోవ్యధకు గురైంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన ఎ.రమేష్‌, బెంగళూరుకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.  వీరిద్దరూ బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ యువతికి మాయమాటలు చెప్పి రెండేళ్ల కిందట స్వగ్రామానికి వచ్చిన రమేష్‌ తన పధకం ప్రకారమే దగ్గరి బంధువుల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి రమేష్‌ను దూరం పెట్టింది.. మాటలు లేవు డ్యూయెట్ పాటలు లేవు.. ఐతే  తల్లిదండ్రులు తనకు  బలవంతంగా పెళ్లి చేశారంటూ మాయమాటలు చెప్పి ఆమెకు మళ్లీ దగ్గరయ్యాడు రమేష్ . ఈ క్రమంలోనే రమేష్‌కు పలు దఫాలుగా రూ.50 లక్షల నగదు, బంగారం ఇచ్చినట్లు ఆ యువతి చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఏడాది కిందట స్వగ్రామానికి వచ్చిన రమేష్‌ అప్పటి నుంచి తనతో ఫోన్లోనే మాట్లాడేవాడని.. కొద్ది రోజులుగా ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేయడంతో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు ఈనెల 3న నవుడూరులోని రమేష్‌ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. రమేష్‌ కుటుంబ సభ్యులు ఆమెను దుర్భాషలాడి బెదిరించడంతో దిక్కుతోచని స్థితిలో నవుడూరు బస్టాండ్‌ వద్ద కూర్చొని విలపిస్తుండగా స్థానికులు గమనించారు. ఈ విషయం బయటకు వస్తే తమ పరువు పోతుందని భావించిన రమేష్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెకు మాయమాటలు చెప్పి పెనుమంట్ర మండలం పొలమూరు శివారులో ఒక ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో ఎస్సై ఎ.పైడిబాబు రంగంలోకి దిగారు. మంగళవారం పొలమూరులోని ఆ ఇంటికి వెళ్లి బాధిత యువతిని విడిపించి వీరవాసరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష్‌, అతడికి సహకరించిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

అది విషయం ప్రేమైన దోమైన కొంచం ఆచితూచి అడిగి వేయాలంటారు.. సో మన లైఫ్ లో కూడా ఎప్పుడో ఒక్క సారి ఇలాంటి వాళ్ళు తగులుతుండొచ్చు ముందు గానే ప్రిపేర్ అవ్వండి వాళ్ళ చేతిలో మోసపోవడానికి కాదు.. ప్రేమ పేరుతో మోసాలు చేసేవాళ్లను ఎత్తుగడలను తిప్పికొట్టడానికి.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu