జగన్ లానే కేటీఆర్ కు చెల్లెలితో వైరమా? షర్మిల బాటలోనే కవిత పార్టీ పెడతారా? 

రాజకీయాలు రక్త సంబంధాలను కూడా దూరం  చేస్తాయా  అంటే.. చేస్తాయి అనేందుకు చరిత్రలో చాలా ఉదాహణలే కన్పిస్తాయి. సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆయన భార్య మేనకా గాంధీని ఇందిరా గాంధీ అర్థ రాత్రి ఇంటి నుంచి  బయటకు పంపేశారు. నిజానిజాలు ఎలా ఉన్నా, ఇందిరా గాంధీ చిన్నకోడలు మేనకా గాంధీని బయటకు పంపడానికి,పెద్ద కోడలు రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ కారణమని అప్పట్లో అనేక కథల కథనాలు వచ్చాయి. అదెలా ఉన్నా, అలా అర్థరాత్రి ఒంటరిగా బయటకు వచ్చిన మేనకా గాంధీ, మళ్ళీ ఇంతవకు ఆ ఇంటివైపు కన్నెత్తి చూడలేదు.అంతే కాదు, రాజకీయంగానూ ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని బీజీపీలో చేరారు, ఇప్పటి వరకు అమె,ఆమె  కుమారుడు వరుణ్ గాంధీ బీజేపీలో కొనసాగుతున్నారు.రాహుల్, ప్రియాంకా వాద్రాలు కూడా వరుణ్ గాంధీతో అదే దూరం పాటిస్తున్నారు. అలాగే, గ్వాలియర్ రాజ మాత విజయ రాజే సింధియా,(బీజేపీ) ఆమె  కుమారుడు మాధవ రావు సింధియా (కాంగ్రెస్) ల మధ్య రాజకీయ విభేదాల అడ్డుగోడలు ఆమె ఉన్నత కాలం ఆలాగే ఉన్నాయి. పార్లమెంట్’లో ఒకరికొకరు ఎదురైనా పలకరించుకో లేనంత దూరం పెంచాయి. 

ఉభయ తెలుగు రాష్ట్రాలలో అలాంటి అంటే ... టోటల్’గా అలాగే కాకపోవచ్చును కానీ, కొంచెం అటూ ఇటుగా సిమిలర్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా నడుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్సార్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల మధ్య రాజకీయాలు ఎంత పెద్ద అగాధాన్ని సృష్టించాయో వేరే చెప్పనక్కర్లేదు. అఫ్కోర్స్, ఆ ఇద్దరి  మధ్య దూరం అంతలా పెరగడానికి ఇంకా వేరే కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, రాజకీయ విభేదాలు, ఆకాంక్షలు అసలు కారణం అనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేం అక్కరలేదు.‘జగనన్న వదిలిన బాణం అంటూ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, జైలులో ఉన్న జగన్ రెడ్డ్డి రాజకీయ భవిష్యత్’ను బతికించిన షర్మిల పుట్టింట పరాయి పిల్ల అయిపోయింది.అన్న చెల్లి మధ్య విభేదాలు, తండ్రి సమాధి వద్ద కూడా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోలేని స్థితికి చేర్చాయి. చివరకు ఆమె, తన రాజకీయ ఆకాంక్ష తీర్చుకునేందుకు మేట్టినిట్ట సొంత పార్టీ పెట్టుకున్నారు.  

ఇక అసలు విషయానికి వస్తే విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ప్రగతి భవన్’లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా వాహన పూజ, అయధ పూజ నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు.ఇది పత్రికలలో వచ్చిన వార్త. 

ఇది ఈ సంవత్సరమే కాదు, గత ఐదారేళ్లుగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఆ ఫోటులు చూస్తూనే ఉన్నాం ... కానీ,  గతానికి  ఇప్పటికీ మధ్య గొప్ప వ్యత్యాసం కనిపిస్తోంది. ఈపూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసిఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు కె. తారక రామారావు, వారి సతీమణి  శైలిమ, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారని పత్రికలు వార్తను ప్రచురించాయి. పొటోలు కూడ ప్రచురించాయి. కానీ, ఈవార్తలో, ఈ ఫోటోలలో ముఖ్యమంత్రి బిడ్డ కవితమ్మ ఎక్కడా కనిపించలేదు.  
నిజానికి ఇలా కుటుంబ వేడుకలలో కవిత కనిపించకుండా పోవడం ఇదే తొలిసారి కాదు. 

అంతకు ముందు ఏమో తెలియదు కానీ, రాఖీ పండగ నుంచి ముఖ్యమంత్రి కుటుంబ వేడుకల్లో, ఫ్యామిలీ ఫోటోస్’లో కవిత కనిపించడంలేదు. చివరకు ప్రగతి భవన్’లో జరిగిన బతుకమ్మ వేడుకల్లోనూ ... ఆమె లేరు. గతంలో ప్రగతి భవన్ లో ఏ పండగ  జరిగినా  సెంటర్ అఫ్ ది అట్రాక్షన్... ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కవిత, తెలంగాణ పెద్ద పండగకు కూడా పుట్టింటికిరాక పోవడం కుటుంబ, బంధు వర్గాలు ముక్కున వేసేఉకునేలా చేసింది. అంతే  కాదు రాజకీయ వర్గాల్లో కూడా సంచలన వార్తగా ఈ వార్త  చక్కర్లు కొడుతోంది. అయితే,ఇలా అన్నా చెల్లీ మధ్య దూరం పెరగడానికి, కుటుంబ కలహలకు పదవుల పోరాటమే కారణం అని అందరి నోట వినవస్తోంది.

మరో వంక ఇలా ఇటు కుటుంబంలో అటు పార్టీలో అలాంటి  అనూహ్య పరినామాలు అన్నిటికీ ఒకేఒక్కడు కారణమని అంటున్నారు.పార్టీ అధ్యక్ష పదవి కానీ, ముఖ్యమంత్రి పదవి కానీ, వారసత్వంగా కేటీఆర్’కే వస్తుంది. అయితే, ఆయన సరైన సమయం వచ్చే వరకు ఆగి ఉంటే అదోలా ఉండేదని, అలా కాకుండా కేటీఆర్  పట్టాభిషేకానికి వత్తిడి చేయడంవల్లనే ఫామిలీలో, ప్రతిలో విభేదాలు ముదిరి పాకాన  పడ్డాయని అంటున్నారు. ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో ... ఇంకెంత దూరంపోతాయో .. చూడవలసిందే అంటున్నారు. అయితే, షర్మిల తీసుకున్న డ్రాస్టిక్ స్టెప్ కవిత తీసుకోరని మాత్రం చెప్పవచ్చును అంటున్నారు. ఏమైనా రాజకీయం రాజకీయమే ... అందుకే కావచ్చు ‘డెవిల్ దై నేమ్ ఈజ్ పాలిటిక్స్ .... రాక్షసీ నీపేరు రాజకీయమా ..అంటారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu