వారెవా రుతురాజ్‌.. ఐపీఎల్ కింగ్‌.. ఆరెంజ్ క్యాప్‌.. ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్..

ఐపీఎల్ 2021 ఎప్ప‌టిలానే అద‌ర‌గొట్టింది. చెన్నై సూప‌ర్‌కింగ్స్ మ‌రోసారి క‌ప్పు కొట్టింది. సూప‌ర్ కెప్టెన్‌గా ధోనీ ఇమేజ్ మ‌రింత పెరిగింది. చెన్నై విక్ట‌రీలో కీరోల్ మాత్రం యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్‌దే. ఈసారి ఐపీఎల్ హీరో కూడా అత‌నే. రుతురాజ్‌.. ఇప్పుడు ఐపీఎల్‌-రాజ్‌.

రుతురాజ్ ఈ సీజన్‌లోనే అత్యధిక పరుగులు-635 చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఐపీఎల్ హిస్ట‌రీలోనే ఆరెంజ్ క్యాప్ అందుకొన్న అతిచిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌గా’ ఎంపికై వారెవా అనిపించాడు. అందుకే, క్రికెట్ ఫ్యాన్స్ అంతా రుతురాజ్ ఫుల్ డిటైల్స్ కోసం గూగుల్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో రుతురాజ్ ఇప్పుడో స్టార్ క్రికెట‌ర్‌. 

ఈ ఐపీఎల్‌లో రుతురాజ్‌ 635 ర‌న్స్ చేస్తే.. ఇందులో ఒక సెంచ‌రీ, నాలుగు హాఫ్ సెంచ‌ల‌రీలు ఉన్నాయి. లీగ్‌ దశలో రాజస్థాన్‌ రాయల్స్‌పై 60 బంతుల్లో.. 9x4, 5x6.. 101 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి స‌త్తా చాటాడు. అయితే, ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినా రుతురాజ్ ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది. కోల్‌కతాపై 64 పరుగులు, బెంగళూరుపై 33, సన్‌రైజర్స్‌పై 75, ముంబయిపై 88 ర‌న్స్‌తో మెరుగైన బ్యాటింగ్ చేశాడు. 

పుణెకు చెందిన రుతురాజ్ గైక్వాడ్‌ 1997 జనవరి 31న జన్మించాడు. 2016-17 రంజీ ట్రోఫీతో కెరీర్‌ ప్రారంభించాడు. 2018లో ఇండియా-బి జట్టుకు, అదే ఏడాది ఏసీసీ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌కు ఎంపికయ్యాడు. 2019లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జ‌త‌క‌ట్టాడు. తొలి సీజన్‌లో డగౌట్‌కే పరిమితమ‌య్యాడు. గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్ స్టార్టింగ్‌లోనే కరోనా బారినపడి కోలుకున్నాడు. లాస్ట్ ఇయ‌ర్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి.. మూడు హాఫ్ సెంచ‌రీల‌తో మొత్తం 204 ర‌న్స్ చేశాడు. ఇక ఈ సీజన్‌లో చెలరేగిపోయాడు. రుతురాజ్ చేసిన ర‌న్స్‌.. 5, 5, 10, 64, 33, 75, 4, 88, 38, 40, 45, 101, 13, 12, 70, 32.

ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ సైతం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బాలీవుడ్‌ నటి సాయాలీ సంజీవ్‌తో లవ్‌ ఎఫైర్ ఉందని సోషల్ మీడియాలో గాసిప్స్ వ‌స్తుంటాయి. కానీ, అవ‌న్నీ ఫేక్ అంటాడు రుత‌రాజ్‌. కేవ‌లం బౌలర్లు మాత్రమే తనని క్లీన్‌ బౌల్డ్ చేయ‌గ‌ల‌ర‌ని ఓసారి ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. 

ఖాళీ సమయాల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ‘నార్కోస్‌’ షో అత‌ని ఫేవ‌రేట్‌. సెల్ఫీ తీసుకోవ‌డ‌మంటే క్రేజ్‌. ఫిట్‌నెస్‌కు టాప్ ప్ర‌యారిటీ ఇస్తాడు. క్రికెట్ కాకుండా.. టెన్నిస్‌, వాలీబాల్ ఆడ‌తాడు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu