బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా
posted on Jun 30, 2025 4:24PM
.webp)
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ ఆయన పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావును పార్టీ ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలి కానీ, నీవాడు.. నావాడు అంటూ ఎంపిక చేయడం సరి కాదని విమర్శలు గుప్పించారు.
పార్టీ రాష్ట్ర చీఫ్ గా రామచంద్రరావు ఎంపిక వల్ల పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. హిందుత్వ కోసం పనిచేసే వారికే పదవి ఇవ్వాలని సూచించారు. అంతే కాకుండా పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయడానికి ఆయన ప్రయత్నించారు. అయితే ఆయన నామినేషన్ వేయడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని కూడా విఫలం చేసి ఆయన అనుచరులను బెదరించడంతో రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో బీజేపీ గెలవకూడదనుకునే వారు ఎక్కువయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
.webp)