హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్-2025 పోటీలు

 

హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ దేశల నుంచి సుమారు 120 దేశాల అందగత్తెలు మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీపడనున్నారు. మిస్ ఇండియా నందినీ గుప్తా భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆప్రారంభ వేడుకలు నిర్వహించారు. 250 మంది పేరిణి నత్య ప్రదర్శన చేశారు. ఈ నెల 31 వరకు పోటీలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాగింది. 

జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో పోటీలు అధికారికంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా 250 మంది కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం ఆహూతులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. పరిచయ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులు తమ తమ విభిన్న వస్త్రధారణలతో ర్యాంప్‌పై హోయలొలికించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుస్సాడీ, కొమ్ము కోయ కళాకారులు ప్రదర్శన విదేశీ అతిథులను ఆకట్టుకున్నది. కరేబియన్ లాటిన్ అమెరికాతో పోటీదారులు రాక మొదలయింది. 

ముందుగా అర్జెంటీనా కంటెస్టెంట్ ర్యాంప్ వాక్ చేశారు. రెండవ రౌండ్‌లో ఆఫ్రికా ఖండం, మూడవ రౌండ్‌లో యూరప్ ఖండం ప్రతినిధులు వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించారు. చివరి రౌండ్‌లో ఆసియా ప్రతినిధులు ర్యాంపుపైకి వచ్చారు. మొత్తం 22 దేశాలు నుంచి ప్రాతినిథ్యం వహించాయి. ఈ మిస్ వరల్డ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్ క్రిష్టినా పిజ్కోవా హాజరయ్యారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu