వర్షంలోనూ వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్నికి జన నీరాజనం

 

వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి కల్లితండాకు తీసుకొస్తుండగా ప్రజలు రోడ్డు పొడవునా జననీరాజన పలికారు. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా తండోపతండాలుగా జై జవాన్ జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతికకాయం వెంట ముందుకు జనం సాగుతున్నారు. ప్రజలు తరలివస్తున్నారు. రేపు వీర జవాను మురళీ నాయక్‌కు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. జమ్మూలో పాక్ జరిపిన దాడిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు వీరమరణం పొందాడు. ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు విమానాశ్రయానికి తీసుకొచ్చి, స్వగ్రామానికి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు తరిలించారు. 

ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంత్రి సవిత వెళ్లారు అక్కడి నుంచి ఆయన స్వగ్రామానికి పంపించారు. మురళి పార్థివ దేహాన్ని ముందుగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరు విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఇండిగో విమానంలో బెంగళూరు చేరుకున్న ఆయన పార్థివ దేహానికి సైనిక లాంఛనాలతో నివాళులర్పించారు. చిక్కబళ్ళాపురం మీదుగా ఆయన స్వగ్రామం గోరంటలకు పార్థివ దేహాన్ని తరలించారు. రేపు అంత్యక్రియల్లో మంత్రి నారా లోకేశ్  పాల్గొన్నారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu