రాజ్‌భవన్‌లో మిస్‌వరల్డ్ విజేతలకు గవర్నర్ సన్మానం
posted on Jun 2, 2025 9:15PM
.webp)
తెలంగాణ రాజ్‌భవన్‌లో మిస్‌వరల్డ్-2025 విజేత ఓపల్ సుచాత, ముగ్గురు రన్నరప్‌లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు.ఈ విందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీఎస్, డీజీపీ, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నిర్మాత దిల్‌రాజు దంపతులు హాజరయ్యారు. హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ సుందరీమణులతో గవర్నర్ ముచ్చటించారు.. ‘‘తెలంగాణ ప్రాంతాలు వికసిత్ భారత్‌ను సూచిస్తాయి. మీరు వెళ్లాక తెలంగాణ గురించి చెప్పడానికి చాలా విషయాలుంటాయి’’అని అన్నారు.
తెలంగాణ ఆతిథ్యంపై మిస్‌వరల్డ్ సుచాత స్పందిస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు బాగున్నాయన్నారు. తెలంగాణ ఎప్పటికీ తన మనసులో నిలిచిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో మే 10 నుంచి 31 వరుకు ప్రపంచ అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీలో మిస్‌వరల్డ్‌గా ఎంపికైన థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత, మొదటి రన్నరప్ హాసెట్ డెరెజే(ఇథియోపియా), రెండో రన్నరప్ మయా క్లైడా(పోలాండ్), మూడో రన్నరప్ ఆరేలి జోచిమ్(మార్టినిక్) నిలిచిన విషయం తెలిసిందే.