వీరజవాన్ తల్లికి అమ్మగా మారిన మంత్రి సవిత
posted on May 13, 2025 10:39AM
.webp)
వీర జవాన్ మురళి నాయక్ తల్లికి మంత్రి సవిత అమ్మగా మారారు. కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆమెకు దగ్గరుండి అన్నం తినిపించారు. పాక్ దాడులలో సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ వీరమరణం చెందిన సంగతి తెలిసిందే. ఎదిగి వచ్చిన కుమారుడిని కోల్పోయిన ఆయన తల్లిదండ్రులు గత మూడు రోజులుగా శోక సంద్రంలో మునిగిపోయారు.
అన్నం నీళ్లు మానేసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి సవిత.. వారి పరిస్థితి చూసి చలించి పోయారు. భరత మాత కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటామన్న ధైర్యం చెప్పారు. మురళీనాయక్ తల్లి పక్కనే కూర్చుని ఆమెను ఓదారుస్తూ స్వయంగా అన్నం తినిపించారు. మురళీనాయక్ తల్లికి మంత్రి సవిత స్వయంగా అన్నం తినిపిస్తూ ఓదారుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.