షష్ఠ షణ్ముఖ ఆలయాల్లో జనసేన పూజలు.. ఎందుకో తెలుసా?
posted on May 13, 2025 10:23AM

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పిన మన దేశ సైన్యంతో పాటు దేశ నాయకత్వానికి దైవ బలం, ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయించాలని నిర్ణయించారు.
దీంతో ఆయన ఆదేశం మేరకు జనసేన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు షష్ఠ షణ్ముఖ క్షేత్రాలలలో మంగళవారం (మే 13) పూజలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని షష్ఠ షన్ముఖ ఆలయాలలో ఈ పూజలు జరుగుతున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు ఈ పూజలలో పాల్గొన్నారు. తమిళనాడులోని ఆరు మురుగన్ ఆలయాలు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లలోని రెండేసి సుబ్రహ్మణ్య క్షేత్రాలు, అలాగే విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం పురూహుతిక ఆలయాలలో జనసేన ఆధ్వర్యంలో ఈ పూజలు జరుగుతున్నాయి. ఇటీవల ఆలయాల యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ ఈ షష్ఠ షణ్ముఖ ఆలయాలను సందర్శించిన సంగతి తెలిసిందే.