మాలేపాటి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేష్
posted on Nov 6, 2025 10:41AM

ఇటీవల మరణించిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం (నవంబర్ 6) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సుబ్బానాయుడు, భాను చందర్ వంటి కార్యకర్తలను కోల్పోవడం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్న లోకేష్ తనకు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ సబ్బానాయుడితో మంచి పరిచయం, అనుబంధం ఉందన్నారు.
సుబ్బానాయుడు అనారోగ్యానికి గురయ్యారని తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్లు చెప్పిన ఆయన సబ్బానాయుడి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మాలేపాటి కుటుంబానికి అండగా ఉంటానన్నారు. అంతే కాకుండా ఆ కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకువచ్చేందుకు వ్యక్తిగతంగా తాను చేయూతనిస్తానని లోకేష్ చెప్పారు. మాలేపాటి పై దుప్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.