రోజా ఎబౌట్ టర్న్.. రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి!?
posted on Nov 6, 2025 8:10AM

సీనియర్ హీరోయిన్, నటి రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలలో నటించడం చాలా వరకూ తగ్గించేశారు. టీవీ రియాలిటీ షోలలో జడ్జీగా చేసినప్పటికీ.. మంత్రి అయిన తరువాత అదీ మానేశారు. గత ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చినా సినిమాల జోలికి మాత్రం వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఆమె ఎబౌట్ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఆమె సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయారు.
తమిళ సినిమా లెనిన్ ఇండియన్ అనే సినిమాతో రోజా వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు. ఈ మేరకు ఆ మూవీ మేకర్స్ రోజా తమ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అంతే కాకుండా సినిమా వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు కూడా. ఇక రోజా 2013లో డాటర్ అఫ్ వర్మ అనే చిత్రంలో చివరిసారిగా నటించారు. ఇక ఇప్పుడు తమిళమూవీతో రోజా సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే.. ముందు ముందు ఆమె నటిగా మళ్లీ బిజీ అవ్వాలని భావిస్తున్నట్లు తెలు స్తోంది. అయితే ఆమె తెలుగు సినిమాలలోనూ నటిస్తారా? నటిస్తే ఆమెకు వచ్చే అవకా శాలెలాంటివి? అన్న చర్చ అప్పుడే మొదలైంది.