విషమిచ్చి చంపేయండి...తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు

 

ఓ మహిళా  ఐఏఎస్‌పై దుష్ప్రచారం చేయడం దురదష్టకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నాపై ఏమైనా రాయండి తట్టుకుంటా కానీ మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని అన్ని మీడియా వాళ్లని అభ్యర్థిస్తున్నాని మంత్రి తెలిపారు.  మీకు కుటుంబాలు ఉంటాయి కదా? ఆఫీసర్లను బదిలీ చేసే హక్కు సీఎంకే ఉంటుందని కోమటిరెడ్డి అన్నారు. ఈ తప్పుడు రాతల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఇంకా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం తరుపున సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాని తెలిపారు. నాకు ఉన్న ఒక్కగానొక కుమారుడిని కోల్పోయి ఫౌండేషన్ పేరుతొ ప్రజాసేవ చేస్తున్నాని తెలిపారు. నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేదని వాపోయారు. అధికారుల మీద అభాండాలు వేయడం సరికాదు. రేటింగ్‌లు, వ్యూస్‌ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu