కిషోర్ చంద్రదేవ్ పై గంటా ఫైర్
posted on Nov 20, 2012 3:41PM

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై కాంగ్రెస్ అధిష్టానికి లేఖ రాశారన్న ఆరోపణలెదుర్కొంటున్న కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ పై మంత్రులు గంటా శ్రీనివాస రావు ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డిపై, సత్యనారాయణలపై లేని పోని వ్యాఖ్యలు చేసిన కిషోర్ చంద్రదేవ్ పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గంటా డిమాండ్ చేశారు. బాక్సైట్ అంశంపై ఏ అర్హతతో లేఖ రాశారో కిషోర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కిరణ్ బాగా పరిపాలిస్తున్నారని ఆయన కితాబిచ్చారు.
పవర్ ప్లాంటులలో తనకు వాటాలు ఉన్నాయని కిషోర్ చెప్పడం గర్హనీయమని శత్రుచర్ల అన్నారు. తనకు పవర్ ప్లాంటులలో ఎలాంటి వాటాలు లేవన్నారు. వాటాలు ఉన్నట్లు నిరూపిస్తే తాను ఆత్మహత్యకు సిద్ధమని, నిరూపించని పక్షంలో ఆయన కూడా అందుకు సిద్ధంగా ఉంటారా అని సవాల్ విసిరారు.