కాంగ్రెస్ ఖతం కరో...హరీష్ నినాదం

 

congress harish rao, trs harishrao, trs telangana, congress separate telangana

 

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. ఇక నుంచి కాంగ్రెస్‌తో చర్చలు మాని తెలంగాణ కోసం మానుకోట వంటి పోరాటాలు చేస్తామని తేల్చిచెప్పారు. ‘కాంగ్రెస్ ఖతం కరో.. తెలంగణ హాసిల్ కరో..’ నినాదంతోనే ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు.


మొన్నటి వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో విలీనం అవుతుందనే బాధలో ఉన్న తెలంగాణ ప్రజలు కరీంనగర్‌లో కేసీఆర్ డిక్లరేషన్ ప్రకటనతో వారిలో కొత్త ఉత్సాహం వచ్చిందని హరీష్‌రావు తెలిపారు. సూర్యాపేట సమరభేరి సభతో మలిదశ ఉద్యమానికి నాంది పలుకుతామని తెలిపారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని వందసార్లు చెప్పే బదులు అనుకూలమని ఒక్కసారి చంద్రబాబు చెప్లే చాలు అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu