మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

 

ఏపీ మెగా డీఎస్సీ కీ విడుదలైంది. 16,347 టీచర్ల నియామకాల కోసం జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీ విడుదల చేశాక అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాక ఫైనల్ కీ రిలీజ్ చేసినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎం. వి కృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై అభ్యంతరాల స్వీకరణ ఉండదని పేర్కొన్నారు. 

కీ కోసం అభ్యర్థులు ఈ  https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి చెక్ చేసుకోవచ్చును. ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu