మేడారానికి పోటెత్తిన భక్త జనం

 

ములుగు జిల్లా మేడారానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం, సంక్రాంతి సెలవులు కావడంతో అమ్మవార్లను దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సమ్మక్క-సారలమ్మ దేవతలను మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో గద్దెల ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటారని అధికారుల అంచనా వేస్తున్నారు. రద్దీ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. 

మేడారం వైపు వేలాది వాహనాలు రావడంతో పస్ర-మేడారం మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నార్లపూర్, కొత్తూరు, జంపన్నవాగు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

 అన్ని రూట్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకలతో ప్రధాన ఆస్పత్రి, మరో రెండు చోట్ల మినీ హాస్పిటళ్లు, మొత్తం 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 35 అంబులెన్సులు 3,199 మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనున్న విషయం తెలిసిందే. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu