జుకెర్ బర్గ్ సంచలనమైన నిర్ణయం.. 99 శాతం షేర్లు దానం
posted on Dec 2, 2015 11:38AM

ఫేస్ బుక్ స్థాపకుడు జుకెర్ బర్గ్ ఓ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే తన కంపెనీకి చెందిన 99 శాతం షేర్లను స్వచ్చంధ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకన్నాడు. జుకెర్ బర్గ్ ఇంత సడెన్ గా.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనుకుంటున్నారా..? ఎందుకంటే.. జుకెర్ బర్గ్.. ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ లకు వారం క్రితమే పాప (మాక్స్) పుట్టింది. దీంతో వారు తమ షేర్లలో 99 శాతం స్వచ్ఛంద సంస్థలకి ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు మాక్స్ రావడంతో తమ జీవితంలో కొత్త వెలుగులు ప్రారంభమయ్యాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా ప్రస్తుతం ఆ షేర్ల విలువ 45 అమెరికన్ బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో వాటి విలువ దాదాపు రూ. 3 లక్షలు అన్నమాట. మొత్తానికి జుకెర్ బర్గ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మొత్తాన్ని స్వచ్ఛంద సేవ కోసం ఇచ్చి రికార్డు సాధించారు.