'ప్రస్తుతం ఉపసంహరించుకొం,భవిష్యత్తులో హామీ ఇవ్వలేం '
posted on Nov 10, 2011 11:18AM
న్యూఢిల్లీ:
పెంచిన పెట్రోల్ ధరలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేసినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల బృందానికి గతవారం పెంచిన పెట్రోల్ ధరలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని చెప్పడంతో పాటు భవిష్యత్తులో ధరలు పెంచబోమని ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ద్వారా తెలిసింది.
ప్రస్తుతం పెంచిన ధరలను ఉపసంహరించుకుంటామని కానీ, భవిష్యత్తులో ధరలు పెంచబోమని కానీ హామీ ఇవ్వడం సాధ్యం కాదని ప్రధాని తృణమూల్ ఎంపీల ప్రతినిధి బృందానికి కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పారని అధికార వర్గాలు తెలియజేశాయి.అంతేకాదు, భవిష్యత్తులో చమురు ధరలు పెంచాల్సి వచ్చినప్పుడు యుపిఏ మిత్రపక్షాలను సంప్రదిస్తామన్న గ్యారంటీ ఇవ్వడం కూడా సాధ్యం కాదని ప్రధాని వారికి స్పష్టంగా చెప్పినట్లు ఆ వర్గాలు తెలిపాయి.