'తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే'
posted on Nov 10, 2011 10:56AM
హైద
రాబాద్:ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో రెండో ఎస్సార్సీ వేయాలనుకుంటే తెలంగాణకు వర్తించకుండా చూడాలనితెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత హరీష్ రావు కోరారు.దీనిపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, రెండో ఎస్సార్సీకి ముడిపెడితే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ భూస్థాపితమై పోతుందని హెచ్చరించారు.రెండో ఎస్సార్సీ వేయకుండానే దేశంలో 15 రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం 2009 డిసెంబరు తొమ్మిదో తేదీన జారీ చేసిన ప్రకటనలో ఎస్సార్సీ అనే మాటే లేదన్నారు. రెండో ఎస్సార్సీ అనడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని ఆయన మండిపడ్డారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. అదేసమయంలో ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళుతామని హరీష్ రావు ప్రకటించారు.