నేడే పుట్టిన సూర్య చెప్పిన మాటలు...!

 

"జోష్" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు నేడు. చైతన్య ప్రస్తుతం "ఆటోనగర్ సూర్య", "మనం" చిత్రాలలో నటిస్తున్నాడు. పుట్టినరోజు సందర్భంగా తన సినిమాల గురించి మాట్లాడుతూ.. "ఆటోనగర్ సూర్య" నా కెరీర్ లోనే ఓ మైలురాయిలా నిలిచిపోయే సినిమా అవుతుంది. దర్శకుడు దేవకట్టా నా పాత్రను తీర్చిదిద్దిన విధానం అధ్బుతం.నిర్మాత అచ్చిరెడ్డి ఎక్కడ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక ఐటెం సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈనెల 27 నుండి ఈ పాటను చిత్రీకరిస్తారు. అనూప్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పాటలను కూడా విడుదల చేయనున్నాం అని అన్నారు.


అదే విధంగా తాతయ్య, నాన్నతో కలిసి చేస్తున్న "మనం" చిత్రం కూడా చాలా కొత్తగా ఉండబోతుంది. వారిద్దరితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ కుమార్ అధ్బుతంగా తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 1 నుండి కర్ణాటకలొని కూర్గ్ లో తాజా షెడ్యుల్ ని ప్రారంభించానున్నాము. ఈ చిత్రం అభిమానులందరినీ అలరించే విధంగా ఉండబోతుంది అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu