డిజిపి కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం

Man suicide attempt at DGP office, Man suicide, DGP office  Man suicide,  DGP office suicide news

 

హైదరాబాద్ లో డిజిపి కార్యాలయంముందు ఓ వ్యక్తి ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకి ప్రయత్నించాడు. ఓ హత్య కేసులో సాక్షిగా ఉన్న తనని హత్య చేయించిన కార్పొరేటర్ రోజూ బెదిరిస్తున్నాడని, వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొంటూ ఆ వ్యక్తి ఓ సూయిసైడ్ నోట్ కూడా రాశాడు.


ఆత్మహత్యా యత్నం గురించి మీడియాకి ముందుగా సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు బాధితుడి ప్రయత్నాన్ని అడ్డుకుని వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి పంపించారు. బాధితుడు చెబుతున్నది నిజమేనా, లేక మానసిక స్తితి సరిగ్గా లేక అలా ప్రవర్తించాడా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu