జగన్ పై మండిపడ్డ ఈటెల
posted on Nov 18, 2012 11:32AM
.jpg)
జగన్ స్వాతంత్ర పోరాటం చేసి జైలుకు వెళ్లాడా అని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రంలో దోపిడీ రాజ్యం కొనసాగిందని మండిపడ్డారు. జగన్‌కు బుద్ధి చెప్పే రోజులొస్తాయన్నారు. ప్రజలందరికీ అరచేతిలో బెల్లం పెట్టి నాకించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ పాలన గురించి ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజాం సుగర్స్ పైన విచారణ జరిపిస్తానన్న వైయస్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక నివేదికలను తొక్కిపెట్టారని ఆరోపించారు. వైయస్ 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత తెలంగాణను అడ్డుకున్నారన్నారు. జగన్ ఎంపీగా ఉంటూ తెలంగాణకు వ్యతిరకంగా పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్నారని, వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణ వ్యతిరేక పార్టీ అన్నారు.