వేదాంతం సత్యనారాయణ శర్మ కన్నుమూత

 Vedantam Satyanarayana Sarma dead, Vedantam Satyanarayana Sarma died. Vedantam Satyanarayana Sarma nomore, Vedantam Satyanarayana Sarma death, Vedantam Satyanarayana Sarma dies

 

ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు.. పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణశర్మ (78) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన.. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కూచిపూడిలో అధికార లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.


అధికారులు, ప్రజా ప్రతినిధులు, కళాకారులు, కళాభిమానులు ఈ అంత్యక్రియలకు హాజరై అశ్రునివాళి అర్పించారు. మచిలీపట్నం నుంచివచ్చిన ప్రత్యేక పోలీసుబృందం గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం చేసింది. సత్యనారాయణ శర్మకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu