25 ఏళ్లుగా ఆకులు తింటూ...


ఒకటి కాదు రెండు కాదు  ఏకంగా గత 25 ఏళ్లుగా ఆకులు తింటూ బ్రతుకున్నాడు ఓ వ్యక్తి. వివరాల ప్రకారం...పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని గుజ్రన్‌వాలా జిల్లాకు చెందిన మెహమూద్‌ అనే వ్యక్తి పేదరికంతో నానా కష్టాలు పడుతుండేవాడు. దీంతో ఇత‌రుల ముందు చేయి చాచి అడుక్కోవడం ఇష్టంలేక ఇలా చెట్ల ఆకులు, బెరడులు తింటున్నాన‌ని చెబుతున్నాడు. అయితే అదేదో ఒకటో.. రెండో రోజులు కాదు.. ఏకంగా 25 ఏళ్లుగా చెట్ల ఆకులను తింటూ జీవిస్తున్నాడు. అయితే ఈమధ్య అతనికి ఓ పని దొరికింది. దీంతో ఇప్పుడు కాస్త డ‌బ్బు సంపాదిస్తున్నప్ప‌టికీ త‌న‌కు అలవాట‌యిపోయిన ఆకులే తింటున్నాడు. అంతేకాదు, తాను ఆకులు తింటూ బ‌తుకుతుండ‌డంతో త‌న‌ తిండికి ఏ లోటూ లేదని చెబుతున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu