ఉగ్రవాదుల అరాచకం..50 మంది సైనికులు మృతి

 

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్‌ లు మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆఫ్గనిస్తాన్‌లోని ఆర్మీ బేస్‌పై దాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. ఆఫ్గనిస్తాన్‌ ఉత్తరప్రాంతంలోని మజర్‌-ఇ-షరీఫ్‌ నగరం సమీపంలో ఉన్న ఆర్మీబేస్‌పై మిలిటరీ యూనిఫాంలో వచ్చిన ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 50 మంది సైనికులు మృతిచెందారు. సుమారు 10 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. వారిలో ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఏడుగురు ఉగ్రవాదులను కౌంటర్‌ ఆపరేషన్‌లో సైనికులు కాల్చిచంపగా.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu