మరో అవమానం..భారత సంతతి సర్జన్ జనరల్‌ను తీసేసిన ట్రంప్ సర్కార్..
posted on Apr 22, 2017 5:14PM

ఇప్పటికే తమ ఉద్యోగాలు భారతీయులు కొట్టుకొని పోతున్నారని హెచ్-1బీసా నిబంధనలు కఠినతరం చేస్తూ...మరోపక్క జాత్యహంకారంతో భారతీయులకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అక్కడ ఉన్న మరో భారతీయ సంతతికి చెందిన వైద్యుడికి అవమానం జరిగింది. అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవి నుంచి భారత సంతతి వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తిని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. ఆ స్థానంలో తమ సొంత మనిషిని పెట్టుకోడానికి వీలుగా ఆయనను రాజీనామా చేయాలని కోరింది. కాగా ఒబామా హయాంలో డాక్టర్ వివేక్ మూర్తిని అమెరికా సర్జన్ జనరల్‌గా నియమించారు.
ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నాళ్ల పాటు ఇంత ప్రతిష్ఠాత్మకమైన పదవిలో తనను కొనసాగించడం తనకు చాలా గౌరవమని, అదృష్టమని తెలిపారు. అంతేకాదు.. అమెరికా లాంటి పెద్ద దేశం మొత్తానికి ఆరోగ్య విషయాలు చూసుకోవాలని అధ్యక్షుడు అడిగే వరకు ఎదదగడం భారతదేశంలో ఒక పేద రైతు మనవడికి చాలా గౌరవమని, 40 ఏళ్ల క్రితం వలస వచ్చిన తన కుటుంబాన్ని ఆదరించి, తనకు ఈ విధంగా సేవ చేసే అవకాశం కల్పించినందుకు అమెరికాకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు.