రేణుని మిస్ అవుతున్న పవన్ కళ్యాణ్
posted on Jun 10, 2013 6:12PM

అసలే సహజీవనం చేసి, పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లల్ని కూడా కన్న తరువాత పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ లు విడిపోయినట్లు టాలీవుడ్ మొత్తం టాం టాం అయిన విషయం మీకు తెలిసిందే. ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ కూడా సైలెంట్ అవడంతో అందరూ నిజమనే అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే...
ఈ మధ్య మెగా ఫ్యామిలీ హీరోలు ఏ చిత్రం చేసిన కూడా అందులో రేణుదేశాయ్ పేరు వేస్తున్నారు. దాంతో పవన్ కి రేణుని ఎంత మిస్ అవుతున్నాడో తెలుసుకొని, త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న తాజా చిత్రానికి అత్తారింటికి దారేది అనే టైటిల్ పవన్ పట్టుబట్టి మరి ఓకే చేయించాడట. ఈ చిత్ర షూటింగ్ సమయంలో తన కూతురుతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు. అదే విధంగా ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో రేణు కూడా వచ్చే అవకాశాలున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.