మా ఎన్నికలలో మరీ ఇన్ని ట్విస్టులా…
posted on Mar 26, 2015 10:43PM
.jpg)
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ (మార్చి 29) దగ్గరపడుతున్నకొద్దీ జయసుధ, రాజేంద్ర ప్రసాద్ మధ్య జరుగుతున్నా పోటీ చాలా రసవత్తరంగా మారుతోంది. మా అధ్యక్షపదవికి ఇద్దరు సీనియర్ నటులు ఇంతగా పోరాటం చేయడం అందరినీ చాలా ఆశ్చర్యపరుస్తోంది. అందుకు కారణం రాజేంద్ర ప్రసాద్ రాజకీయ నాయకులను ఆశ్రయించడమేనని జయసుధ ఆరోపిస్తుంటే ఆమె వెనుకే మురళీ మోహాన్ తో సహా అనేక మంది రాజకీయ నాయకులు జేరారని రాజేంద్రప్రసాద్ ప్రత్యారోపణలు చేస్తున్నారు.
ఈరోజు ఎవరూ ఊహించని విధంగా నటుడు కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషను వేసారు. మా ఎన్నికలలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఆయన తన పిటిషనులో పేర్కొన్నారు. దానిపై స్పందించిన కోర్టు మా ప్రస్తుత అధ్యక్షుడు మురళీ మోహన్, ఆలీ మరి కొందరికి రేపు కోర్టుకి హాజరుకమ్మంటూ నోటీసులు జారీ చేసింది. మురళీ మోహన్ జయసుధను బలపరుస్తున్నారు కనుక ఆమె ప్రత్యర్ధి వర్గానికి చెందినవారే కళ్యాణ్ ద్వారా ఈ పిటిషను వేయించి ఉంటారని అందరూ భావిస్తున్నారు. ఏమయినప్పటికీ మా ఎన్నికలు సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా మంచి వేడివేడిగా సాగుతున్నాయి.