రాహుల్ గాంధీ అజ్ఞాతవాసం త్వరలో ముగింపు

 

దాదాపు మూడు వారాలుగా అజ్ఞాతవాసంలో గడుపుతున్న రాహుల్ గాంధీ త్వరలోనే మళ్ళీ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చేస్తున్నట్లు తాజా సమాచారం. ఏప్రిల్ 20 నుంచి మళ్లీ ప్రారంభమయ్యే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు. పార్టీ అధిష్టానం అందుకు అంగీకరించి, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాతనే ఆయన తన అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన పదవి నుండి తప్పుకొని గౌరవాధ్యక్షురాలిగా సలహాదారు పాత్రకే పరిమితమవుతూ రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్షపదవి లేదా కార్యాదక్షపదవి చేప్పట్టవచ్చని తెలుస్తోంది.