బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో  అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది.

దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయససీమలలో  వర్షాలు కురుస్తాయని తెలిపింది.