ఏపీలో విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్!

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తే. తక్కువ విద్యుత్ వినియోగించేవారికీ, పీఎం సూర్యఘర్  పథకం కింద  సోలార్ ప్యానెళ్లు పెట్టుకున్న లబ్ధిదారులకు అడ్వాన్స్ కంజప్షన్ డిపాజిట్ (ఏసీడీ) చార్జీల వసూలు నిర్ణయాన్ని ఏపీసీపీడీసీఎల్ ఉపసంహరించుకుంది.

గతంలో ఈ కేటగరీ వినియోగదారుల నుంచి ఏసీడీ చార్జీలు వసూలు చేశారు. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో ఇప్పుడు ఏపీసీపీడీసీఎల్ ఏసీడీ చార్జీలను రద్దు చేసింది.