ప్రేమను కొలవచ్చట..
posted on Mar 16, 2015 6:05PM

మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అయితే ఎంత ప్రేమిస్తున్నారో కొలిచి చెప్పగలరా. కానీ అలా చెప్పొచ్చు అంటున్నాడు ఓ చైనా శాస్త్రవేత్త. మెదడులో కలిగే రసాయనిక మార్పులను గుర్తించడం ద్వారా యువతీ యువకుల మధ్య ఎవరి పట్ల ఎవరికి ఎంత ప్రేముందో చెప్పవచ్చని తెలిపారు. దీనికోసం దాదాపు వంద మంది యువతీ యువకుల బ్రెయిన్లను అధ్యయనం చేశారంట. అయితే ప్రేమలో పడ్డవారు, పడనివారి మెదడులో రసాయనిక మార్పులు వేరు వేరుగా ఉన్నాయని, ప్రేమలో పడని వారి మెదడులో ఒకే చోట రసాయనిక మార్పులు చోటుచోసుకోగా, ప్రేమలో పడ్డవారి మెదడులో వారి ప్రేమ తీవ్రతను బట్టి 12 చోట్ల రసాయనిక మార్పులు చోటుచేసుకొన్నాయని చైనా ప్రొఫెసర్ జియావోచు ఝంగ్ తెలిపాడు. ఈ విషయాన్ని ఆయన ‘ఫ్రాంటియర్స్ ఇన్ హ్యూమన్ న్యూరోసైన్స్’ పత్రికలో ప్రచురించారు. ప్రేమ గాఢతనుబట్టి మెదడులో రసాయనిక మార్పులు చోటుచేసుకున్నాయని, వీటిని మున్ముందు మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా ఎవరు, ఎవరిని ఎంతగా ప్రేమిస్తున్నారో కచ్చితంగా చెప్పవచ్చని శాస్త్రవేత్త ఝంగ్ వివరించాడు.