హుస్సేన్ సాగర్లో దూకి విద్యార్థుల ఆత్మహత్య

 

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పైనుంచి హస్సేన్‌సాగర్లో దూకి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే ఇద్దరు విద్యార్థులు హుస్సేన్ సాగర్లో దూకారు. వారిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరణించిన విద్యార్థులను పంజాగుట్టకు చెందిన సలీం, ఖాజాగా గుర్తించారు. వీరిద్దరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu