బీదా రవిచంద్ర అవుట్ తిప్పే స్వామీ ఇన్!
posted on Mar 17, 2015 8:47AM
.jpg)
తెలుగుదేశం పార్టీ ఈసారి సీనియర్లను పక్కన బెట్టి యం.యల్.సి. ఎన్నికలలో కొత్తవారికి సీట్లు కేటాయించడం విశేషం. నన్నపనేని రాజకుమారి, గాలి ముద్దు కృష్ణం నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్ వంటి వారు ఆశపడినప్పటికీ వారినందరినీ కాదని ఉత్తరాంద్ర నుంచి మహిళా అభ్యర్ధిగా గుమ్మడి సంద్యారాణిని, కోస్తా నుండి వివివి చౌదరికి, రాయలసీమ నుండి తి్ప్పేస్వామిని అబ్యార్దులుగా ఖరారు చేసింది. మొదట నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవి చంద్రకు సీటు ఖాయం చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆఖరు నిమిషంలో ఆయన స్థానంలోకి అనంతపురం జిల్లాకు చెందిన తిప్పే స్వామీ పేరు ఖరారు చేసారు. గత ఎన్నికలలో ఓడిపోయినా వారికి సీట్లు ఇవ్వకూడదనే సూత్రంతో పార్టీలో సీనియర్లను పక్కనబెట్టినప్పటికీ, అరకు నుండి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయిన గుమ్మడి సంధ్యా రాణికి మినహాయింపునిచ్చి ఆమె పేరు ఖరారు చేయడంతో యం.యల్.సి. పదవి ఆశించి భంగపడిన సీనియర్లు పార్టీ అధిష్టానంపై కొంచెం గుర్రుగా ఉన్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రా జిల్లాల నుండి ఒక్కొకరికి అవకాశం కల్పిస్తూనే, సంద్యారాణికి ఈ సీటు కేటాయించడం ద్వారా మహిళలకు, అదే విధంగా ఆమెకు, తిప్పే స్వామికి కేటాయించడం ద్వారా బీసీలకు, వివివి చౌదరి ద్వారా అగ్రవర్ణాలకు కూడా తగు ప్రాధాన్యత ఇచ్చినట్లయింది.