రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్
posted on Oct 8, 2025 7:40PM
.webp)
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు పిటిషన్‌పై విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే సమయంలో రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకుండా స్టే ఇవ్వాలని వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
రేపు ఉదయం 10.30 గంటల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రేపటి ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే, పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు..సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు.
రెండు దశల్లో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు
అక్టోబర్ 9 నుంచి తొలివిడుత నామినేషన్లు
అక్టోబర్ 13 నుంచి రెండో విడుత నామినేషన్లు
అక్టోబర్ 23న మొదటిదశ ఎన్నికల పోలింగ్
అక్టోబర్ 29న రెండో దశ ఎన్నికల పోలింగ్