ముక్కులో నిమ్మరసం.. టీచర్ మృతి..
posted on Apr 29, 2021 5:29PM
అతని పేరు బసవరాజ్. వయసు 43 ఏళ్ళు. ఆయన ఓ పతులు. పంతులు అంటే గుడిలో మంత్రాలు చదివే పంతులు కాదు. బడిలో పాఠాలు చెప్పే పంతులు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో రకరకాల ఫేక్ న్యూస్ లు వస్తున్నాయి. కొబ్బరి నూనెతో కరోనా తగ్గుతుందని. నిమ్మ రసం ముక్కులో వేసుకుంటే కరోనా ధరకిరాదని. చేతిలో ఫోన్ ఉండి, అందులో డేటా ఉన్నోడు ప్రతి ఒక్కడు, సర్టిఫికెట్ లేకుండానే వైద్యుడు అయిపోతున్నారు. అవ్వని ప్రజా ఆరోగ్యం కోసం చేయడం లేదు. సమాజ ఉద్దరణ కోసం చేయడం లేదని. యూట్యూబ్ లో ఇచ్చే డబ్బుల కోసమో, లేక నాకు తెలివి ఉందని అందరు అనికోవాలని చేస్తున్నారని ఆ టీచర్ గ్రహించలేకపోయాడు. అందుకే ఆ ఫేక్ న్యూస్ లు నమ్మి తన ప్రాణాలు తీసుకున్నాడు ఆ బడి పంతులు.
రాయచూరు జిల్లాలో నివసించే బసవరాజ్ ముక్కులో నిమ్మరసం పిండుకోవడం గురించి తెలుసుకుని, తాను కూడా అలాగే చేశాడు.నిమ్మరసం ముక్కులో పిండుకుంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు దరిచేరవని, తద్వారా కరోనా రాకుండా ఉంటుందని నమ్మాడు. కానీ విషాదకర రీతిలో ముక్కులో నిమ్మరసం పిండుకున్న తర్వాత బసవరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చివరికి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అతడి కుటుంబంలో విషాదం అలముకుంది.
దెబ్బ తగిలితే అదే చోట మందు రాయాలి. అది వాస్తవం కానీ దానివల్ల ఏదైనా ప్రమాదం ఉందొ లేదో తెలుసుకోకుండా.. తొందర పడి ఫేక్ న్యూస్ లు విని ప్రాణాల మీదికి తెచ్చుకోకండి.