కొత్త ఛానల్ ప్రారంభం రోజునే లాలూకి షాకిచ్చిన అర్నబ్...

 

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. లాలూ, షహబుద్దీన్ కు సంబంధించిన కొన్ని ఆడియో సంభాషణలు బయటకు వచ్చాయి. మహ్మద్ షహబుద్దీన్‌ ప్రస్తుతం జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన లాలుతో  మాట్లాడినట్టు.. జైలు నుంచి ఫోన్ చేసి అల్లర్లకు సంబంధించిన ఆదేశాలు ఇస్తున్నట్లు ఒక ఆడియో టేపు బయటకు వచ్చింది. ఓ టీవీ ఛానల్ ఈ ఆడియో టేపును విడుదల చేసింది. ఇంతకీ ఆ ఛానల్ ఏంటీ.. అనుకుంటున్నారా..? ఏదో కాదు.. అర్నాబ్ గోస్వామికి చెందిన కొత్త చానల్ 'రిపబ్లిక్ టీవీ'. అర్నాబ్ గోస్వామి కొత్త చానల్ 'రిపబ్లిక్ టీవీ' ఈరోజు ప్రారంభమైంది. ప్రారంభమైన ఈరోజే అర్నాబ్ లాలుకి షాకిచ్చాడు. శివాన్ నియోజకవర్గంలో అల్లర్లు చెలరేగినప్పుడు పోలీసులు ఎలా ప్రవర్తించాలన్న అంశంపై ఈ క్లిప్ లో లాలూకు షహబుద్దీన్ సూచనలు ఇస్తున్నట్టు ఉంది. ఆ ఛానల్ కథనం ప్రకారం..ఈ టేపును ప్రసారం చేయవద్దని ఆయన అనేకసార్లు కోరినట్లు తెలిపింది. అంతేకాదు దీనిపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ స్పందించాలని కోరింది. మరి దీనిపై లాలు ఎలా స్పందిస్తారో చూద్దాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu