లాలూ భూ కుంభకోణం... 22 చోట్ల ఐటీ కొరడా..
posted on May 16, 2017 11:20AM
.jpg)
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ప్రస్తుతం కాలం అస్సలు కలిసిరానట్టు ఉంది. ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వచ్చి పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో షాక్ తగిలింది. రూ. 1000 కోట్ల విలువైన బినామీ భూములకు సంబంధించి పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడి చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 ప్రాంతాల్లో ఒకేసారి ఐటీ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా ఓ ఐటీ అధికారి మాట్లాడుతూ.. ల్యాండ్ డీల్స్ కు సంబంధించి లాలూ ప్రసాద్, అతని కుటుంబంతో సంబంధాలు ఉన్న వ్యాపారవేత్తలకు చెందిన ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. వెయ్యి కోట్ల విలువైన బినామీ ఆస్తులు, పన్ను ఎగవేతల ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించామని చెప్పారు. కాగా ఇటీవలే దాణా కుంభకోణం పై ప్రత్యేక విచారణ ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దానికితోడు జైల్లో ఉన్న క్రిమినల్ మహ్మద్ షహబుద్దీన్‌తో లాలూ మాట్లాడుతున్నట్లు ఓ ఆడియో టేప్ బయటపడింది. ఇప్పుడు ఈ బినామి భూముల వ్యవహారం. మొత్తానికి లాలూ అవినీతి పాలనకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నట్టు ఉన్నారు.