లగడపాటి రాజీనామా ఆమోదించిన స్పీకర్
posted on Feb 19, 2014 12:19PM
.jpg)
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామాను లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ఆమోదించారు. లగడపాటి రాజీనామాను ఆమె సభలో చదివి వినిపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడంపై మనస్థాపం చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను స్పీకర్ మీరా కుమార్ కి ఫ్యాక్స్ చేశారు.
రాష్ట్ర విభజనను ఆపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశానని, ఇలాంటి రాజకీయాల్లో తాను ఇమడలేనని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి రావొద్దన్నారు. ఈ ఘటన కొత్త రాష్ట్రాల డిమాండ్‌కు ఊతమిస్తుందని లగడపాటి వెల్లడించారు. ఇక నుండి ప్రజలంతా భారతీయులుగా, తెలుగువారిగా కలిసి మెలిసి ఉండాలని, రాష్ట్ర విభజన గురించి తాను ఇప్పుడు ఏం మాట్లాడిన ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.