కిరణ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్
posted on Feb 19, 2014 11:53AM
.jpg)
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాకు గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. కిరణ్ రాజీనామాపై మీడియా సమావేశం అయిన వెంటనే క్యాంపు కార్యాలయం నుంచి రాజభవన్ బయలుదేరి వెళ్లి గవర్నర్ కు రాజీనామాను లేఖను సమర్పించారు. దీంతో గవర్నర్ వెంటనే ఆమోదముద్ర వేశారు. కిరణ్ ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని గవర్నర్ కోరకపోవడం విశేషం.
కిరణ్ రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం తేలిగ్గా తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. కిరణ్ రాజీనామా ఉహించినదేనని, అందులో విశేషం ఏమిలేదని అన్నారు. రాష్ట్ర విభజన్ జరిగిన తరువాత కిరణ్ రాజీనామా చేయక తప్పదని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్న మీడియా ప్రశ్నకు షిండే సమాధానం చెప్పలేదు.