మహిళా సర్పంచ్ ఆత్మహత్య
posted on Dec 11, 2014 9:02AM

మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్ పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ సరళ (35) గురువారం తెల్లవారుఝామున ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మరణించింది. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సరళ గతంలో మరికల్ గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. సరళ భర్త రాములు కూడా మరికల్ సర్పంచ్‌గా పనిచేశారు. ఐదేళ్ళ క్రితం రాములు మహబూబ్ నగర్ దగ్గర ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి సరళ మానసికంగా క్రుంగిపోయింది. ఆ బాధతోపాటు కుటుంబంలో కూడా కలహాలు పెరగడంతో ఆమె జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సర్పంచ్‌గా గ్రామానికి సేవలు చేసిన సరళ ఆత్మహత్య ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. మాజీ సర్పంచ్ సరళ మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.