మూగ యువతిపై అత్యాచారం

 

ఇటీవలి కాలంలో అత్యాచారాల సంఖ్య పెరుగుతోంది. కామాంధుల బారిన పడిన అనేకమంది యువతులు అన్యాయమైపోతున్నారు. వరంగల్ జిల్లాలో ఒక మూగ యువతి మీద సామూహిక అత్యాచారం జరిగింది. మూగ యువతి అని కూడా కనికరం చూపకుండా దుర్మార్గులు ఆమె మీద అత్యాచారం జరిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఐనవోలులో ఈ దారుణం జరిగింది. గురువారం ఉదయం ఒంటరిగా వున్న మూగ యువతి మీద కన్నేసిన రేపిస్టులు ఆమె మీద సామూహిక అత్యాచారం జరిపారు. అనంతరం ఆ మూగ యువతిని ఓ చెట్టుకు కట్టేసి పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి గురైన మూగ యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. రేపిస్టుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu