జుట్టు పట్టుకుని కొట్టుకున్న లేడీ కానిస్టేబుళ్ళు
posted on Oct 15, 2014 10:56AM

గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు పోలీస్ స్టేషన్లోనే జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. దాంతో వీళ్ళిద్దర్నీ పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. వీరిద్దరూ కొట్టుకున్న కారణం చూస్తే మనకి నవ్వాలో ఏడవాలో అర్థంకాదు. ఒక లేడీ కానిస్టేబులమ్మ భర్తతో మరో లేడీ కానిస్టేబులమ్మ అక్రమ సంబంధం పెట్టుకుందట. తన భర్తని విడిచిపెట్టమని మరో కానిస్టేబులమ్మ ఎంత బతిమాలినా మరో కానిస్టేబులమ్మ పట్టించుకోవడం లేదట. దాంతో చాలాకాలంగా ఇద్దరూ గొడవపడుతున్నారు. మంగళవారం తమ గొడవకు గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌ని వేదికగా చేసుకుని గొడవలో భాగంగా ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. చివరికి ఒక కానిస్టేబులమ్మ తనకు పోలీసులే న్యాయం చేయాలంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి కూడా దిగింది. మొత్తానికి అధికారులు ఇద్దర్నీ సస్పెండ్ చేశారు.