హైకోర్టులో కెటీఆర్ క్వాష్ పిటిషన్
posted on Dec 20, 2024 11:35AM
ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణంలో ఎ 1 గా మాజీ మంత్రి కెటీఆర్ ఉన్నట్లు ఎసిబి కేసు నమోదు చేసిన నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. తనను అరెస్ట్ చేయకూడదని కెటీఆర్ క్వాష్
పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కెటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని కెటీఆర్ మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. కెటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ కావొచ్చు. న్యాయపరంగా పోరాడి గట్టెక్కాలని కెటీఆర్ భావిస్తున్నారు. కెటీఆర్ పిటిషన్ పై సింగిల్ బెంచ్ జడ్జి శ్రావణ్ ముందు విచారణకు వచ్చింది. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్ అయిన జడ్జి శ్రావణ్ ముందు విచారణకు వచ్చింది.