తెలంగాణ భవన్‌లో ఘనంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు

 

 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్‌ కేక్‌ కట్‌ చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు తరలివచ్చి ఆయనకు జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు.

వారందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తనను అభిమానించే వారి ప్రేమ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానని చెప్పారు.ఈ రోజు ఉదయం కేటీఆర్  బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఇంట్లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నరు. మరోవైపు కేటీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎంవో అధికారిక ఎక్స్ ద్వారా తెలిపారు ఆకాంక్షించారు. వైసీపీ అధినేత జగన్ ట్వీట్టర్ వేదికగా నా సోదరుడు తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu