కృష్ణాజలాల వివాదం.. ఆ రాష్ట్రాలకు సంబంధం లేదు.. మీరే పంచుకోండి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల వివాదం ఎప్పటినుండో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున 4 రాష్ట్రాలకు మళ్లీ నీటి కేటాయింపులు జరపాలని కోరింది. దీనికి కేంద్రం స్పందించి.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఈవివాదంతో సంబంధం లేదని..ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటినే.. ఏపీ తెలంగాణ పంచుకోవాలని స్పష్టం చేసింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu